వచ్చే 3 రోజులు.. ఈ జిల్లాల్లో వర్షాలు

80பார்த்தது
వచ్చే 3 రోజులు.. ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతవరణ శాఖ తెలిపింది. శుక్రవారం పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని పేర్కొంది. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో వానలు పడుతాయని హెచ్చరించింది.

தொடர்புடைய செய்தி