ఆరు నెలల కిందట దుబ్బాక అగ్నిమాపక కేంద్రంలో ఉన్న అత్యాధునిక అగ్నిమాపక వాహనాన్ని సిద్దిపేటకు తరలించి, అక్కడున్న పాత వాహనాన్ని దుబ్బాకకు కేటాయించారు. దీంతో దుబ్బాక డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షుడు మాడబోయిన శ్రీకాంత్ ఆధ్వర్యంలో పలుమార్లు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులను కలిసి గతంలో దుబ్బాకకు మంజూరు చేసిన వాహనాన్ని తిరిగి పంపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ చొరవతో వాహనాన్ని దుబ్బాకకు పంపించారు.