HYD-సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుమారుడు శ్రీ తేజ్ ప్రాణాలతో పోరాడుతున్నాడు. తాజాగా శ్రీ తేజ్ హెల్త్ బులిటెన్‌ను వైద్య సిబ్బంది విడుదల చేశారు. 'ప్రస్తుతం శ్రీ తేజ ఆరోగ్యం నిలకడగా ఉంది. వెంటిలేటర్, ఆక్సిజన్ లేకుండానే ఊపిరి పీల్చుకోగాలుగుతున్నాడు. మళ్ళీ ఫీవర్ పెరుగుతోంది. వైట్ బ్లడ్ సెల్స్ మిగితా సెల్స్ ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతున్నాయి. కానీ నాడి వ్యవస్థ పనితీరు ఇప్పటికీ అలాగే ఉంది' అని ప్రకటించారు.