తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలికంగా విధులకు గైర్హాజరవుతున్న 16 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను సర్వీసు నుంచి తొలగిస్తూ యాదాద్రి డీఈవో సత్యనారాయణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పరిధిలోని పలు పాఠశాలల్లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీలు 2005 నుంచి 2022 వరకు అనధికారికంగా విధులకు గైర్హాజరయ్యారు. నోటీసులు అందించినప్పటికీ సమాధానం లేకపోవడంతో గెజిట్ నోటిఫికేషన్ ప్రచురితమైన తదుపరి సర్వీసు నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.