సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని వావిలాల గ్రామంలోని పీర్ష చెరువు నిండుకుండలా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువులో పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకోవడంతో చెరువు జలకళ సంతరించుకుంది. చెరువు నిండడంతో స్థానిక రైతులు, మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.