జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామ పరిధిలోని కిష్టయ్య పల్లి గ్రామానికి చెందిన రైతు బాసెట్టి సాయికుమార్ కు చెందిన 18 బర్రెలు గతంలో కాలుష్య జలాలు తాగి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం మోడ్రన్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ సభ్యులు చర్చించి రైతు కుటుంబానికి 16 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా బాధిత రైతుకు అందజేశారు.