మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కేంద్రం ఎల్‌ఐసీ బీమా సఖీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద మూడేళ్ల శిక్షణ సమయంలో మహిళలు రూ.2 లక్షల కంటే ఎక్కువ ఆర్థిక సహాయం, కమీషన్ ప్రయోజనం పొందుతారు. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణతతో 18 ఏళ్లు దాటిన వారు అర్హులు. ఈ స్కీమ్ దరఖాస్తు కోసం వెబ్‌సైట్ https://licindia.in/test2 ను సందర్శించాలి. ఆ తర్వాత క్లిక్ ఫర్ బీమా సఖి ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అనంతరం మీ పేరు వివరాలతో పూరించండి. శాఖల పేర్లు, బ్రాంచ్‌ని ఎంచుకుని "సబ్మిట్ లీడ్ ఫారమ్"పై క్లిక్ చేస్తే సరి.