ఉప్పల్: తీర్థయాత్రల పేరిట మోసం చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్
ఉప్పల్ హైకోర్టు కాలనీలో ఉండే భరత్ కుమార్ శర్మ(45) గాయత్రీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నడుపుతున్నాడు. మానస సరోవరం లాంటి ప్రదేశాలకు తీసుకెళ్తానని పలు ప్యాకేజీల పేరుతో వందల మంది నుండి కొన్ని లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఎప్పుడు తీసుకెళ్తారు అని డబ్బు చెల్లించిన వారు అడగగా రేపు మాపు అంటూ మాట దాటవేస్తున్నాడు. విసుగు చెందిన బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్సై మధు కేసు నమోదు చేసి భరత్ ను రిమాండ్ కు తరలించారు.