షాద్ నగర్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మిగిలిన సీట్లకు తక్షణ ప్రవేశాలు నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మణ్ సోమవారం తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 30న కళాశాలకు రావాలన్నారు. ఐఎంసి పేమెంట్ ద్వారా ఈ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు చేపడుతున్నామని తెలిపారు.