లాలాపేటలోని సాయి నగర్ ప్రాంతంలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలని పద్మారావు గౌడ్ అధికారులకు సూచించారు. సోమవారం ఈ మేరకు ఓ లేఖను జిల్లా కలెక్టర్ కు ఆయన పంపారు. పనుల్లో జాప్యం వల్ల నిరుపేద లైన లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారని, పనులను త్వరగా పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలని సోమవారం సూచించారు.