మీర్పేట్: మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడికి జైలు శిక్ష
మైనర్ బాలికను ప్రేమ పేరుతో వెంబడిస్తూ, అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి మూడేళ్ల కఠిన కారాగార శిక్షను న్యాయమూర్తి శుక్రవారం విధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన సాయి కుమార్ ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో వెంబడిస్తూ, అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. వాదనల అనంతరం న్యాయమూర్తి నిందితుడికి 3 సంవత్సరాల కారాగార శిక్ష విధించారు.