
కోఠిలో ఉచితంగా రూ. 12 లక్షల ఆపరేషన్
పలు కారణాలతో చిన్నపిల్లలకు పుట్టుకతోనే వినికిడి సమస్య ఉంటున్నట్లు కోఠి ENT ఆసుపత్రి డాక్టర్ వీణ తెలిపారు. కాక్లియర్ ఇంప్లాంటేషన్ ద్వారా పిల్లలు వినికిడి లోపాన్ని అధిగమించే అవకాశం ఉందని, రూ. 12 లక్షలు ఖర్చు చేసే దీనిని ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు. ఏటా కోఠి ఆసుపత్రిలో 60 నుంచి 70 సర్జరీలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.