ప్రభుత్వం ఇల్లు కోట్టేయాలనుకుంటే ఎప్పుడో కొట్టేసేదని ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదని మూసి రివర్ ప్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ దాన కిషోర్ స్పష్టం చేశారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. మూసి పరివాహక ప్రాంత ప్రజలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం అప్లై చేసుకున్నారని, వారిని అడిగితే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సిఫ్ట్ అవుతామని చెప్పారు. వారి పూర్తి అంగీకారం తీసుకుని వారిని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు షిఫ్ట్ చేస్తామన్నారు.