ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలను కాపాడిందని ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్ అన్నారు. మంగళవారం చార్మినార్ కు చెందిన అనీషా ఫాతిమాకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును తన కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ అందజేశారు. రూ. 1 లక్ష విలువగల చెక్కును అందజేసినట్లు ఎమ్మెల్సీ పేర్కొన్నారు. అర్హులైన వారు సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు.