ఫలాక్ నుమాలో అసంపూర్తిగా ఉన్న పనులను హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తో జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలాంబర్తి పరిశీలించారు. పలక్ నుమా ఆర్ఓబీ రైల్వే శాఖ చేపట్టాల్సిన పనులను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట ప్రాజెక్ట్ సీఈ దేవానంద్, ఎల్బీనగర్, చార్మినార్ జోనల్ కమిషనర్లు హేమంత్ కేశవ్ పాటిల్, వెంకన్న ఎల్బీనగర్ జోన్ ప్రాజెక్టు ఈఈ రోహిణి తదితరులు పాల్గొన్నారు.