AP: గేదెల కోసం చెరువులోకి దిగిన దంపతులు మృతి చెందారు. ఈ విషాద ఘటన ఏలూరు జిల్లాలోని నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో జరిగింది. గేదెల కోసం భర్త చెరువులోకి వెళ్ళాడు. అనంతరం భర్త కోసం భార్య కూడా చెరువులోకి వెళ్లింది. ఈ క్రమంలోనే చెరువులోనే మునిగి భార్యాభర్తలిద్దరూ మృతి చెందారు. మృతులను కొండ రాంబాబు , ప్రశాంతిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.