ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని కేంద్రమంత్రి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. శనివారం షేక్ పేట్ డివిజన్ పరిధిలోని విరాట్ నగర్లో పర్యటించారు. స్థానికంగా నూతన బోర్వేల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ. బోర్వెల్ తో స్థానికంగా మంచి నీటి సరఫరా సమస్యలు ఉండవన్నారు. బొర్వెల్ నీటిని అవసరానికి అనుగుణంగా వినియోగించుకోవాలని సూచించారు.