జీహెచ్ఎంసీ ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం కమిషనర్ ఇలంబర్తిని ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రేహ్మత్ బెగ్ కలిశారు. పాతబస్తీ పరిధిలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ది పనులపై వినతిపత్రం అందజేశారు. అలాగే ఎంఐఎం ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అభివృద్ది పనులను వేగవంతం చేయాలన్నారు. నూతన అభివృద్ది పనులకు నిధులను విడుదల చేయాలని కోరారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్సీ తెలిపారు.