మైనర్ బాలికను ప్రేమ పేరుతో వెంబడిస్తూ, అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి మూడేళ్ల కఠిన కారాగార శిక్షను న్యాయమూర్తి శుక్రవారం విధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన సాయి కుమార్ ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో వెంబడిస్తూ, అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. వాదనల అనంతరం న్యాయమూర్తి నిందితుడికి 3 సంవత్సరాల కారాగార శిక్ష విధించారు.