నీతి ఆయోగ్ కమిటీ సభ్యుడు ప్రొఫెషర్ రమేష్ చంద్ అధ్యక్షతన టోకు ధరల సూచిక (WPI) అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం ప్యానెల్‌ను నియమించింది. ఇందులో వివిధ రంగాలకు చెందిన 18 మంది నిపుణులు సభ్యులుగా ఉండనున్నారు. ఈ ప్యానెల్ ఇది 2011-12 నుండి 2022-23 వరకు ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులను ప్యానెల్ అధ్యయనం చేయనుంది. 18 నెలల్లో తుది నివేదికను ప్యానెల్ సమర్పించాల్సి ఉంది.