డిసెంబర్ 29న ఢిల్లీలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న ప్రధాని మోదీ

66பார்த்தது
డిసెంబర్ 29న ఢిల్లీలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న ప్రధాని మోదీ
దేశ రాజధాని ఢిల్లీలో 2025 ఏడాది ప్రారంభంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార ఆప్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. కేజ్రీవాల్ ఇంటింటా ఎన్నికల ప్రచారం చేస్తూ.. ఉచిత హామీలు కూడా ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 29న ఢిల్లీలో ప్రధాని మోదీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. పరివర్తన్ ర్యాలీతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

தொடர்புடைய செய்தி