లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరుకు బయలుదేరారు. ఇవాళ ఉదయం 11.20 గంటలకు జర్మనీ మ్యూనిచ్ నగరంలోని ఎయిర్ పోర్ట్ నుంచి బిజినెస్ క్లాస్ విమానంలో ప్రజ్వల్ బయలుదేరారు. మే 31వ తేదీ తెల్లవారుజామున ప్రజ్వల్ బెంగళూరు చేరుకోనున్నారు. అయితే ప్రజ్వల్‌ను బెంగళూరు ఎయిర్ పోర్ట్‌లోని సిట్ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.