మొబైల్ ఫోన్ లతో అతిగా ఆడుకునే చిన్నారుల్లో మెదడు, వినికిడిపై ప్రతికూల ప్రభావం పడటంతోపాటు మాట్లాడే సామర్థ్యం తగ్గిపోతోందని యూఎస్ NIH తాజా అధ్యయనం స్పష్టం చేసింది. "ఏడుస్తున్న పిల్లలను ఊరడించేందుకు కార్టూన్లు, పాటలు ప్లే చేసి మొబైల్ ను ఇస్తే వారు చూడటం, వినడమే నేర్చుకుంటారు. మాట్లాడటానికి ప్రయత్నించరు. అందుకే కొన్ని కేసుల్లో 5-6 ఏళ్ల పిల్లలకు కూడా మాటలు రావడం లేదు” అని అధ్యయనం చెబుతోంది.