అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆరుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఆలమూరు మండలం కండ్రిగ గ్రామానికి చెందిన విద్యార్థులు ఇంట్లో చెప్పకుండా పారిపోయారు. విద్యార్థులు స్కూలుకు వెళ్లడం లేదని తండ్రిదండ్రుల మందలించారు. దీంతో ఆరుగురు విద్యార్థులు ఇంట్లో చెప్పకుండా ఏటో వెళ్లిపోయారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ జరుపుతున్నారు.