రాష్ట్ర ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇతర అన్ని హామీలను అమలు చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నిర్మల్- ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జే. రాజు పిలుపునిచ్చారు. సోమవారం భైంసా మండలం హంపోలి గ్రామంలో ఫిబ్రవరి 20 నాటి చలో హైదరాబాద్ కార్యక్రమ గోడ ప్రతులను విడుదల చేసి ఆయన మాట్లాడుతూ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమయింది అన్నారు.