దస్తురాబాద్ మండల ఎస్ఐ గా శంకర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు పెంబి మండలంలో ఎస్ఐ గా పనిచేసిన శంకర్ దస్తురాబాద్ మండలానికి బదిలీ పై వచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తానన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.