రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కల్వకుంట్ల నారాయణ విమర్శించారు. బుధవారం ఖానాపూర్ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాక్షిక రుణమాఫీ చేసి ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. ఆంక్షలు లేని రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నిర్వహించే రైతుల ధర్నాను అందరూ విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ఖానాపూర్ అధ్యక్షులు రాజ గంగన్న, రాజు, ప్రదీప్ ఉన్నారు.