జన్నారం మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న వ్యాపారులు బందును పాటించాలని శుక్రవారం ఆదివాసీ సంఘాల నాయకులు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జైనూర్లో ఆదివాసీ మహిళపై జరిగిన హత్యాయత్నంపై ప్రభుత్వం స్పందించకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ శనివారం రాష్ట్ర వ్యాప్త బందుకు పిలుపునిచ్చామన్నారు. శనివారం జన్నారం మండలంలో వ్యాపారులు అన్ని దుకాణాలు మూసివేయాలని కోరారు.