నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని గురువారం ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, మంత్రి దామోదర రాజనరసింహలతో కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య, లక్ష్మీకాంతారావు, మోత్కుపల్లి నర్సింహులు, పసునూరి దయాకర్ పాల్గొన్నారు.