నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం ప్రజలకు రాఖీ పండుగ సందర్బంగా సోమవారం ఎమ్మెల్యే వేముల వీరేశం శుభాకాంక్షలు తెలిపారు. సోదర సోదరీమణుల ఆత్మీయ బంధాన్ని చాటే రక్షా బంధన్ పండుగని ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలన్నారు. రాష్ట్రంలో అక్కా చెల్లెమ్మల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. ఆపదలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు తాను అండగా ఉంటానని పేర్కొన్నారు.