సాగర్ ప్రాజెక్టు గేట్లు మూసివేత
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయం క్రస్ట్ గేట్లను బుధవారం మధ్యాహ్నం ప్రాజెక్టు అధికారులు మూసివేశారు. ఉదయం నాలుగు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేసినా, ఎగువ ప్రాంతం నుంచి వరద తగ్గడంతో గేట్లు మూసివేశారు. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 44 వేల క్యూసెక్కులు ఉంది.