నాంపల్లి మండలం కేతపల్లి లో ఆదివారం వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు ఉదయం నుంచి ఉపవాస దీక్షలు, భక్తిశ్రద్ధలతో స్వామివారి కల్యాణోత్సవం కనుల విందుగా ఆసక్తిగా తిలకించారు. భక్తులు తమ కోరికలు తీర్చాలని ప్రార్థించి, ఆశీర్వాదాలు పొందారు.