ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన కేతవత్ శంకర్ నాయక్ ను మిర్యాలగూడ జర్నలిస్టు సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘం నాయకులు ఖాజా హామీదొద్దిన్, యండి ఆస్లాం, కలిమెల నాగయ్యలు మాట్లాడుతూ మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఎంఎల్సిగా ఎన్నిక కావడం హర్షనీయమని తెలిపారు.