డిండి: గ్రామపంచాయతీ కార్మికుల ధర్నా

73பார்த்தது
పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, వేతనాలను బ్యాంకు ఖాతాలో జమ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, లింగమయ్య, జవహర్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி