హైదరాబాద్ విస్తరణ పెరగనుంది. ఎచ్ఎండీఏ స్థానంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ ను ప్రభుత్వం తీసుకుంది. త్వరలో ఆర్ఆర్ఆర్ అందుబాటులోకి రానుండడంతో ఫ్యూచర్ అవసరాల కోసం ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఇందులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాలోని కుప్పగండ్ల చేరుకూర్ అజిలాపూర్ గ్రామాలను ఎచ్ఎంఆర్ పరిధిలోకి తీసుకురానుంది. సెమీ అర్బన్ గా పరిగణిస్తూ వీటిని అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు.