భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

80பார்த்தது
భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
ఆదిలాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక గౌరీ శంకర్ పాత ఆయిల్ మిల్లులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసి పడుతుండడంతో చుట్టుపక్కల వారు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி