మాదిగ ఉప కులాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, ఎంఎస్ఎఫ్ నాయకులు ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను తుంగలో తొక్కుతూ రేవంత్ రెడ్డి సర్కార్ డిఎస్సీ ఫలితాలను వెలువరించి నియామక పత్రాలను అందిస్తామన్నందుకు నిరసనగా ఈనెల 9న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ముట్టడి నిర్వహిస్తామని పేర్కొన్నారు.