కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దూలం శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని, 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.