మండల వ్యవసాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి

51பார்த்தது
మండల వ్యవసాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మందమర్రి మండల వ్యవసాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు బచ్చలి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులు సమయపాలన పాటించడం లేదని, పంటలు పర్యవేక్షణ చేయకుండా రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி