చెన్నూర్ నియోజకవర్గంలో అక్రమాలు చేసే వారిపై రాజకీయ జోక్యం ఉండబోదని, పోలీసులు ఎంతటి వారినైనా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే గడ్డం వివేక్ సూచించారు. నియోజకవర్గంలో ఇసుక, బియ్యం, జూదం పై ఉక్కు పాదంతో అణిచివేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. శనిగకుంట చెరువును బాంబులతో పేల్చిన నిందితులను ఇంకా ఎందుకు పోలీసులు అరెస్టు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.