అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే సదరు దుకాణ యజమానుదారులపై చర్యలు తీసుకుంటామని చెన్నూర్ ఎడిఏ భానోత్ ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి హెచ్చరించారు. మందమర్రి మండల పరిధిలోని ఎరువుల దుకాణాల్లో వారు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లోని ఎరువుల స్టాక్ రికార్డులు, బిల్లు బుక్కులను పరిశీలించారు. ఆధార్ కార్డు ఆధారంగా ఎరువులు విక్రయించాలని సూచించారు.