ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ కొత్త క్రీడా విధానంపై సమీక్షా సమావేశం అనంతరం ఆమోదం తెలిపింది. అనంతరం నాలుగు లక్ష్యాలతో క్రీడా పాలసీ రూపకల్పన చేసింది.. ‘ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3 శాతానికి పెంచాలని, ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ విజేతల ప్రోత్సాహకం రూ.75 లక్షల నుంచి రూ.7 కోట్లకు పెంచాలని, ఒలింపిక్స్, ఏషియన్స్ గేమ్స్‌లో పతకాలు పొందే వారికి ప్రోత్సాహకాన్ని పెంచాలి’ అని ప్రతిపాదించింది.