ఆయిల్ పామ్ పంట సాగు చేయడంతో అధిక దిగుబడులు పొంది రైతులు అధిక లాభాలు గడించవచ్చని మంచిర్యాల జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి అనిత అన్నారు. బెల్లంపల్లి మండలం కన్నాల రైతు వేదికలో ఏర్పాటుచేసిన ఆయిల్ ఫామ్ సాగు యాజమాన్య పద్ధతుల అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నీటి వసతి కలిగిన భూముల్లో ఆయిల్ సాగు చేయడం ద్వారా ఏడాదికి లక్షన్నర ఆదాయం పొందవచ్చని వివరించారు.