ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో దారుణ సంఘటన జరిగింది. మీర్జాపూర్ గ్రామంలో 8 ఏళ్ల బాలికపై కొందరు అత్యాచారం చేశారు. అనంతరం బాలికను చంపి మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కారు. ఆ సంచిని పొదల్లో పారవేశారు. ఈ ఘటన అక్కడ కలకలం రేపింది. కొందరు ఆ సంచిని గమనించి తెరిచి చూడగా బాలిక మృతదేహం కనిపించింది. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక కుటుంబం, స్థానికులు కోరుతున్నారు.