ధ్యానం, శాకాహారంతో వైరస్ లను ఎదుర్కోవచ్చని సింగరేణి సంఘమిత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం సభ్యులు తెలిపారు. అహింస, శాంతి సద్భావన శాకాహార ర్యాలీని బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించారు. పిరమిడ్ కేంద్రం నుంచి కాంటా చౌరస్తా మీదుగా పాత బస్టాండ్ కేంద్రం వరకు కొనసాగింది. శాకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం కలుగుతుందని వారు వివరించారు. ప్రపంచ మేధావులంతా శాకాహారులేనని వెల్లడించారు.