నీల్వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడ మైదానంలో పాఠశాల వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు గిరిధర్ రెడ్డి నేతృత్యం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులలో చదువుతోపాటు క్రమశిక్షణ ప్రభుత్వ పాఠశాలల్లో లభిస్తుందని, ప్రభుత్వ పాఠశాలలు పటిష్టంగా పనిచేస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి.