పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

50பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలోని తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్ పరిధిలో మామిడి తోటలో రహస్యంగా పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, ఎస్సై లచ్చన్న ఆధ్వర్యంలో మామిడి తోట వద్ద దాడులు నిర్వహించారు. వారి వద్ద నుంచి 19, 100తో పాటుగా 8 సెల్ ఫోన్లు, ఏడు బైకులను స్వాధీనం చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி