కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, సమస్యల పరిష్కారానికి ప్రజా పోరాటాలు సాగిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ అన్నారు. బెల్లంపల్లి పట్టణ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సెప్టెంబర్ 1 నుంచి 7వరకు ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని, 11 నుంచి 17వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరుల జ్ఞాపకాలను స్మరిస్తూ వేడుకలు నిర్వహిస్తామన్నారు.