నిషేధిత గంజాయిని రవాణా సరఫరా, విక్రహించే చేసే వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా పీడీ యాక్ట్ అమలు చేయాలని రామగుండం సీపీ శ్రీనివాస్ సూచించారు. గురువారం రామగుండం కమిషనర్ లో మంచిర్యాల జిల్లాలోని ఏసీపీలు సిఐలు ఎస్హెచ్ఓ లతో సమావేశం నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ క్రైమ్ బాధితులు కోల్పోయిన డబ్బు త్వరగా రీఫండ్ అయ్యే విధంగా చూడాలన్నారు.