మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచి పార్టీ మారుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన ఆస్తులు, కాలేజీలకు సంబంధించి వరుస నోటీసులు రావడం.. కూల్చివేతలు జరగడంతో రక్షించుకోవడానికి అధికార కాంగ్రెస్లో చేరతారన్న ప్రచారం సాగింది. అయితే సోమవారం ఏపీ సీఎం చంద్రబాబును మల్లారెడ్డి కలవడం.. ఆయనతో పాటు చంద్రబాబుతో భేటీ అయిన తీగల కృష్ణారెడ్డి తాను టీడీపీలో చేరుతానని ప్రకటించడంతో కొత్త చర్చ మొదలైంది. మల్లారెడ్డి కూడా టీడీపీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.